అండర్ ట్యాంకు నుంచి లాగేస్తారు..పెట్రోల్, డీజిల్ దొంగలు అరెస్ట్

హైదరాబాద్ : బంకుల్లో నుంచి దొంగతనంగా పెట్రోల్ కాజేసే ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. పెట్రోల్ బంకులో ఉండే అండర్ ట్యాంక్ కు సీక్రెట్ గా పైప్స్ పెడుతూ ..పెట్రోల్, డీజిల్ ను లాగేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ దొంగతనంపై పోలీసులు ఆరా తీశారు. ఇవాళ  చర్లపల్లిలో పెట్రోల్ మాఫియా గ్యాంగ్‌ ను అరెస్టు చేశారు.

నలుగురు నిందితులు  పోలీసుల అదుపులో ఉన్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. ఐఓసీ, బీపీసీ డివిజన్ పైప్‌ లైన్ల నుంచి డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ. 90.40 లక్షలు, డీజిల్ ట్యాంకర్, బైక్‌ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy