అండ‌మాన్ అగ్నిప‌ర్వ‌తంలో మ‌ళ్లీ ప్ర‌కంప‌న‌లు

volcanoభారత్‌లో ఉన్న ఏకైక వాల్కెనో 150 ఏళ్ల తర్వాత మేల్కొంది. అండ‌మాన్ దీవుల్లో ఉన్నఈ అగ్నిప‌ర్వ‌తంలో మ‌ళ్లీ క‌ద‌లిక‌లు మొద‌ల‌య్యాయి. దాదాపు 150 ఏళ్లు నిర్మానుషంగా ఉన్న ఆ ప‌ర్వ‌తంలో  ప్ర‌కంప‌న‌లు మొద‌లైనవంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు. చివరగా 1991లో లావాను బయటకు చిమ్మినట్లు తెలిపింది గోవాలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐఓ). ప్రస్తుతం వాల్కెనో నుంచి పెద్ద ఎత్తున పొగలు, లావా బయటకు వస్తున్నాయి. తాజాగా మ‌ళ్లీ ఆ ప‌ర్వ‌తంలో లావా బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు అంచ‌నా వేశారు ఓసియ‌నోగ్ర‌ఫీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్ర‌వేత్త‌లు. పోర్ట్ బ్లెయిర్‌కు 140 కిలోమీట‌ర్ల దూరంలో బారెన్ ఐలాండ్ అగ్నిప‌ర్వ‌తం ఉంది. అయితే ఆ ప‌ర్వ‌తం నుంచి మ‌ళ్లీ స్వ‌ల్ప స్థాయిలో లావాతో పాటు పొగ వస్తున్న‌ట్లు  గుర్తించారు శాస్త్ర‌వేత్త‌లు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 23న అగ్నిప‌ర్వ‌తంలో క‌ద‌లిక‌ల‌ను పసిగట్టిన‌ట్లు  వెల్ల‌డించారు శాస్త్ర‌వేత్త‌లు. పగటి సమయంలో కేవలం పొగ మబ్బులను గమనించిన శాస్త్రవేత్తల బృందానికి రాత్రి సమయంలో పెద్ద సైజులో ఎర్రటి లావా ముద్దలు వెలువడుతున్నట్లు గుర్తించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy