అంతర్జాతీయ మహిళా శక్తికి భాగ్యనగరంలో అపూర్వ సత్కారం

awardsహైదరాబాద్ లో ఈ నెల 28న ప్రారంభంకానున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు.. అన్ని ప్రత్యేకతలే. తొలిసారి హైదరాబాద్ లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు నిర్వహించడం ఒక స్పెషలయితే.. ఈ సదస్సుకు ప్రపంచ దిగ్గజాలు పోటీపడి రావడం.. మరో అద్భుతం. అంతేకాదు.. ఈ సదస్సులో మహిళలకే పెద్ద పీట వేస్తున్నారు. దాదాపు 18 మంది మహిళాప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్య అతిధిగా.. అమెరికా వైట్ హౌస్ సీనియర్ సలహాదారురాలు, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కుమార్తె…ఇవాంకా ట్రంప్ రావడం.. మరో స్పెషల్.

హైదరాబాద్ లో తొలిసారిగా.. 2017, గ్లోబల్ ఇంటర్ ప్రెనూర్ షిప్ సమ్మిత్ జరగనుంది. ఈ నెల 28న ఈ సదస్సును..  ప్రధాని మోదీతో పాటు వైట్ హౌస్ సీనియర్ సలహాదారురాలు, ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కుమార్తె…ఇవాంకా ట్రంప్ ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది.

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు.. అన్నీ ప్రత్యేకతలే. ముఖ్యంగా ఈ సదస్సులో మహిళలకే పెద్ద పీట వేయడం విశేషం. దాదాపు 18 మంది మహిళాప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. వివిధ దేశాలకు చెందిన ఆర్ధికవేత్తలు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాల్లో పేరుపొందినవారు, పెట్టుబదిదారులు.. వీరిలో ఉన్నారు. తమ తమ రంగాల్లో సాధించిన ప్రగతిని ఈ సదస్సు ద్వారా వివరిస్తారు.

సదస్సుకు వచ్చే మహిళా ప్రముఖుల్లో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ భార్య.. చెరీ బ్లెయిర్ ఉన్నారు. మహిళలకోసం ఏర్పాటు చేసిన చెరీ బ్లేర్ ఫౌండషన్ ఫర్ ఉమెన్ సంస్థను.. అమె స్థాపించారు. కొన్ని దేశాల్లో బ్రాంచ్ లను పెట్టి.. నైపుణ్యాలు, సాంకేతికత, నెట్ వర్క్ వంటి అంశాల గురించి మహిళలకు తెలియజేస్తున్నారు. వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మహిళాభివృద్ధి కోసం పాటుపడుతున్నందుకే.. 2013లో చెరీ బ్లెయిర్ ను.. బ్రిటిష్ ఎంపైర్ కు కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ గా నియమించారు.

ఆఫ్గనిస్తాన్ పారిశ్రామికవేత్త.. డిజిటల్ సిటిజన్ ఫండ్ సీఈవో రోయా మహబూబ్ కూడా.. ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళలు, చిన్నారులకు డిజిటల్ లిటరేసీపై ఆమె అవగాహన కల్పిస్తున్నారు. ఎడీ ఎడీ పేరుతో స్థాపించిన మరో కంపెనీ ద్వారా చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్న మహిళలకు.. ఆన్ లైన్ స్కిల్స్ ను నేర్పుతున్నారు.

అలాగే.. ఇటాలియన్ కంపెనీ ఆరెంజ్ ఫైబర్ సహవ్యవస్థాపకరాలు ఎన్ రికా అరేనా కూడా… ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఫ్యాషన్ ఇండస్ట్రీని ఏలుతున్న అరేనా.. ఇన్నోవేషన్, ఎక్సపెరమెంట్స్  అంశాలపై ఈ సదస్సులో వివరిస్తారు. 2014లో ప్రారంభించిన కంపెనీని.. మూడేళ్లలో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేశారు..అరెనా. ఇందుకు కారణం… సిట్రస్ ద్వారా వచ్చిన నార తో.. ఫ్యాషన్ దుస్తులను తయారు చేయడం.

దక్షిణాఫ్రికాలో వంద శాతం నల్లజాతి మహిళల వాటాతో ఏర్పాటైన సంస్థ ఎస్ ఆర్ ఎస్ ఏవియేషన్ ఎమ్ డీ.. సిబోంగిలీ రిజాయిస్ సాంబూ.. ఈ సమ్మిట్ కు వస్తున్నారు. అలాగే.. నైజీరియా వంద సినిమాల్లో నటించిన ఆఫ్రికన్ నటి ఓన్వెకాచీ స్టీఫెనీ లీనస్, నేథాన్ ఆసోసియేట్స్ ప్రెసిడెంట్ సుసాన్ బి చోదాకెవిట్జ్, షటర్ ఫండ్ షౌండింగ్ జనరల్ పార్టనర్ షాలిని కోలిన్స్, సింగ్ పూర్ కంపెనీ ద న్యూ స్యావీ సీఈవో అన్నా వానెస్సా హాటంటో, కాలిఫోర్నియా ఎంటర్ పీనర్ షిప్ సెంటర్ డైరెక్టర్ స్టెఫేన్ మ్యారస్, పెట్రోలింక్ సీఈవో లెరాటో మోట్సమై లు కూడా సదస్సులో పాల్గొంటున్నారు.

సదస్సులో.. ఇండియా నుంచి ఎక్కువమంది మహిళల పాల్గొంటున్నారు. ఐసిఐసీఐ బ్యాంకు సీఈవో.. చందా కొచ్చర్. బ్యాంక్ రంగంలో తనకు ఎదురైన సంఘటనలు, అనుభవాలు, లాభాలను వివరిస్తారు. 1984లో ట్రైనీ ఉద్యోగిగా ఐసిఐసిఐ బ్యాంక్ లో చేరిన చందా కొచ్చర్.. 2009 లో ఆ బ్యాంక్ ఎమ్ డీగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ గ్రూప్ ను ఆమె డవలెప్ చేశారు. ఇండియా.. జపాన్, అమెరికా..ఇండియా లీడర్ల ఫారమ్లలో కొచ్చర్ ఓ సభ్యురాలు.

అదేవిధంగా.. మ్యాప్ మై జెనోమి ఇండియా లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అను ఆచార్య, డీఆర్ డీవో ఏఎస్ ఎల్ సంచాలకులు టెస్సీ థామస్, హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే లిమిటెడ్ సీఈవో అనితా డోంగ్రే, కలారి క్యాపిటల్ మేనేంజింగ్ డైరెక్టర్ వాని కోలా, లెట్స్ వెన్న్చర్ ఆన్ లైన్ ఫౌండర్, సీఈవో శాంతి మోహన్ లు కూడా సదస్సులో పాల్గొంటున్నారు.  క్రిసిల్ లిమిటెడ్ సీఈశో అషు సుయాష్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చీఫ్ ఎక్జుక్యూటివ్ ఆఫీసర్ రుక్మిణి బెనర్జీ, ఐకెపి నాలెడ్జ్ పార్క్ చైర్మన్ దీపన్ విటా చటోపాధ్యాయ్ లు తమ తమ రంగాల్లో సాధించిన ప్రగతి ని వివరిస్తారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy