అంతర్జాతీయ వేదికపై : సత్తా చాటిన తెలంగాణ టెన్నిస్ ప్లేయర్

AMRతెలంగాణ టెన్నిస్ ప్లేయర్ అమినేని శివాని అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటింది. మలేషియాలో జరుగుతున్న మెలాక ఐటీఎఫ్ గ్రేడ్ -4 అంతర్జాతీయ టోర్నీ మహిళల డబుల్స్ విజేతగా నిలిచింది. ఇండోనేషియా ప్లేయర్ ప్రిస్కాతో జత కట్టిన శివాని శనివారం ఫైనల్లో 6-2, 6-4 తేడాతో చైనా జోడీపై గెలిచింది. మరోవైపు సింగిల్స్ లో కూడా శివాని జోరు కొనసాగుతోంది. సెమీస్ లో శివాని ఇండోనేషియా ప్లేయర్ పై నెగ్గి ఫైనల్ కు చేరింది. ఫైనల్లో..థాయిలాండ్ ప్లేయర్ లూండాతో తలపడనుంది శివాని.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy