అవును సోనియానే ఇచ్చింది-సీఎం కేసీఆర్

kcr1సోనియా వల్లే తెలంగాణ సాధ్యమైందని సీఎం కేసీఆర్ చెప్పారు.సోనియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.రాష్ట్ర సాధనలో బీజేపీ నేతల సహకారం కూడా ఉందిని చెప్పారు కేసీఆర్. అందుకే సోనియాతో పాటు రాజ్నాథ్ సింగ్కు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు తెలంగాణ సీఎం. అలాగే బిల్లుకు సహకరించిన 33 పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. దూరదృష్టితోనే గవర్నర్ ప్రసంగం సాగిందని కేసీఆర్ సమర్ధించుకున్నారు. కొత్త ప్రభుత్వం విధివిధానాలపై గవర్నర్ ప్రసంగం బ్రాడ్ లైన్ గా మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
ఇక తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ…రాష్ట్రంలో ఇంకా పూర్తిస్థాయిలో అధికార వ్యవస్థ ఏర్పడలేదన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రాభివృద్ధిలో ప్రతిపక్షాలను కలుపుకుని వెళ్తామని చెప్పారు. ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణను నిర్మిద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. హామీల అమలుకు త్వరలోనే కాలపరిమితి ప్రకటిస్తామని చెప్పారు. అందరం కలిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి లోబడే రిజర్వేషన్లు కేటాయిస్తామని…రిజర్వేషన్ల ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేస్తామిన హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన మరికొన్ని హామీలు వరుసగా….

  • ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్ ఇస్తాం
  • రిజర్వేషన్ల అమలు కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం
  • దానికి ముందు అఖిలపక్ష సమావేశం
  • తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను అమలు చేస్తాం
  • రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం
  • రాజకీయ అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తాం
  • అవినీతికి పాల్పడితే ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదు
  • దళితుల సంక్షేమానికి పెద్దపీటం వేస్తాం
  • దళితుల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తాం
  • అమరువీరుల త్యాగాలను మరువలేం
  • 1969 అమరమీరుల కుటుంబాలకు కూడా సాయం చేస్తాం
  • వృద్ధులు, వితంతువుకు రూ.వెయ్యి పెన్షన్
  • వికలాంగులకు రూ.1500 ఫెన్షన్ ఇస్తాం.
  • పెన్షన్ అమలుపై త్వరలోనే ప్రకటిస్తాం
  • బీడీ కార్మికులకు రూ.వెయ్యి భృతి ఇస్తాం.
  • బంగారంపై రుణాలను కూడా మాఫీ చేస్తాం
  • Comments are closed.

    Connect with us



    © 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
    Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
    without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy