అంతా బడా బాబుల బాబులే..!!

HY-27-BIKE-ACTION_1699230gబాబులు కష్టపడి సంపాదిస్తే బిడ్డలు బలాదూర్ గాళ్లైతరంటే ఇట్నే ఉంటుంది. సిటీలో ఇలాంటి బలాదూర్ బ్యాచ్ బానే పెరిగింది. వందల మంది ఉన్నరంటే నమ్మండి. ఒకడి బండికి బ్రేకులుండవు. ఉన్నా వెయ్యడు. ఇంకొకడు రేసింగ్ అంటడు. మరొకడు మత్తు చాలట్లేదని డ్రగ్స్ కావాలంటడు. ఇట్ట చెప్పుకుంట పోతే.. భారీగానే ఉంటుంది లిస్ట్. రోడ్డుపై మామూలుగా ఎళ్తుంటరు జనం. వెనకనుంచి ఎవడో వచ్చి కొట్టేస్తడు. లేదంటే తన్నేస్తడు. కాదంటే చెవుల దగ్గరికొచ్చి గట్టిగ అరుస్తడు. లేదంటే వెళ్తూ వెళ్తూ ఉండంగనే మీదొచ్చి ఏదో మందు బాటిల్ పడుతుంది. ఒక్కసారిగా టెన్షన్ పడటం.. యాక్సిడెంట్లు జరగడం మామూలే. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ లు సిటీలో చాలామందికే ఉన్నయ్. ఎవరూ ఎవరికీ చెప్పకపోయినా.. ఇలాంటి ఇన్సిడెంట్ ల మీద కంప్లైంట్లు గట్రా ఇవ్వకపోయినా.. ఇవీ మధ్య కామనై పోయాయ్.

chainliquorవీటిని సరిగా అబ్జర్వ్ చేస్తే.. ప్రతి ఒక్కరూ బడా బాబుల బాబులే అని తెలుస్తోంది. రోడ్డు మీద ఒక్కసారే బైక్ సౌండ్ తో చెవులు హోరెత్తించడం కూడా మామూలైపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారే బండ్ల స్పీడ్ పెంచి రెచ్చిపోవడం కూడా రొటీన్ అయిపోయింది. సీసీ కెమెరాలున్నా.. అక్కడక్కడా పోలీసులున్నా.. ఇలాంటి వారిని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. ఈ బలదూర్ బ్యాచ్ కి ఇది సరదాగానే ఉన్నా.. బాధితులు మాత్రం ఒక్కసారే పరేషాన్ కావాల్సిందే. రోడ్లమీదైతే.. ఏమైనా జరగొచ్చు. యాక్సిడెంటవ్వొచ్చు. ప్రాణాలే పోవచ్చు. వీళ్ల సరదా వాళ్ల ప్రాణం మీదకి తెస్తోంది. ఇక డబ్బున్నోళ్ల పుత్రరత్నాలు ఏమాత్రం ఆగని పరిస్థితి. బైక్ రేసింగులకి కొన్ని అడ్డాలున్నయ్. ఇన్నాళ్లూ అక్కడే జరిగేవి రేసింగ్ లు. పోలీసులు ఫోకస్ చేయడంతో.. అడ్డాలు పక్కేరియాలకి షిప్ట్ అయ్యాయ్. ఔటర్ రింగ్ రోడ్ ని ఒదిలేసి.. గండిపేట్ చెరువు, నెక్లెస్ రోడ్ వంటి ఏరియాల్ని సెలక్ట్ చేసుకుంటున్నారు. ముందే రెడీ అయ్యి.. రేస్ మొదలెడుతున్నారు. ఇక ఈవ్ టీజింగ్ లో దొరుకుతున్న వాళ్లలో కూడా బడా బాబుల పిల్లలదే పెద్ద లిస్ట్. ఇక సరదాలకి దొంగతనాలు చేయడం కూడా మామూలే అయిపోయాయ్. కొంత మంది సరదా ఖర్చులకి చోరీలు చేస్తుంటే.. మరికొంత మందైతే థ్రిల్లు.. కిక్కు అని అడ్డమైన పేర్లు పెట్టేసి.. చోరీలు చేస్తున్నారు. జల్సాల కోసం అడ్డదారిలో వెళ్తూ జనాన్ని పరేషాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి కేసులు.. ఇన్సిడెంట్లన్నీ డబ్బున్నోళ్లు ఎక్కువగా ఉండే  ఏరియాల్లోనే జరుగుతుండడంతో.. పోలీసులు కూడా నిఘా పెట్టేశారు. ఇప్పటికే చాలామందిని పట్కుని తాట తీస్తున్నారు. సీసీల్లో క్లిక్ చేసి.. లోపలేస్తున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy