అంతా మీరే చేశారు: మోడీ సర్కార్ పై మమత ఫైర్

mamta-bnrjiపశ్చిమ బెంగాల్ బసీర్ హట్, బదురియా సంఘటనలు పొలిటికల్ హీట్  పెంచాయి. ఆందోళనలు జరుగుతున్న బసీర్ హట్ కు వెళ్లే ప్రయత్నం చేసిన బీజేపీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎంపీలు మీనాక్షి లేఖీ, ఓమ్ మాథుర్, సత్యపాల్ సింగ్ లను మిఖాయెల్ నగర్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ ఎంపీలకు పోలీసులకు మధ్య వివాదమైంది. తాము ఎంపీలమన్న ముచ్చట మర్చిపోయారా..? అని పోలీసుల మీద సీరియస్ అయ్యారు మీనాక్షి లేఖీ. వాస్తవాలను మమత సర్కారు దాచిపెడుతున్నదన్నారు. బదురియా, బసీర్ హట్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో గొడవలపై వెస్ట్ బెంగాల్ సర్కారు సీరియస్ యాక్షన్ తీసుకుంది. 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేసింది. ఉత్తర 24 పరగణాల జిల్లా ఎస్పీ భాస్కర్ ముఖర్జీని   తీసేసి.. కొత్త ఎస్పీగా సుధాకర్ రావు ను నియమించింది.

రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.  బోర్డర్ లో ఉద్రిక్తతలకు కేంద్రమే కారణమన్నారు. రాష్ట్ర సర్కారుకు కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదన్నారు. బదురియా, బసీర్ హట్ ఘటనలపై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామన్నారు.

అటు.. డార్జిలింగ్ లో పరిస్థితులు మరోసారి అదుపుతప్పాయి. సొనాడా పట్టణంలో నిరసనకారులు రెచ్చిపోయారు. డార్జీలింగ్ హిమాలయన్ రైల్వేస్ టాయ్ రైల్వే స్టేషన్ ను తగలబెట్టారు. రైల్వే స్టేషన్ లో ఉన్న ఫర్నీచర్, వస్తువులను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్ పై దాడితో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలు మోహరించాయి. డార్జిలింగ్ పట్టణంల కూడా నిరసనలు కొనసాగుతున్నయ్. డార్జిలింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరున్న ఓ పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశారు.

డార్జిలింగ్ ప్రజలు ఆందోళనలు విరమించాలన్నారు. చర్చలతో సమస్య పరిష్కారమవుతుందన్నారు. అయితే.. శాంతియుత వాతావరణం ఏర్పడినతర్వాత చర్చలు జరుపుతామన్నారు.  కేంద్ర సర్కారు మీద మమతా బెనర్జీ కామెంట్స్ చేసుడు కరెక్ట్ కాదన్నరు కేంద్రమంత్ర పీయూష్ గోయల్. రాజకీయ లబ్దికోసం మమతా బెనర్జే.. రాష్ట్రంల పరిస్థితులు దిగజారేతట్టు చేశారన్నారు. కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్రంలో పరిస్థితి మీద రివ్యూ చేస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy