అంతా రెడీ: కాసేపట్లో రాష్ట్రపతి పోలింగ్

ramnath-kovind-44414వ రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తో పాటు.. రాష్ట్రాల్లోని అసెంబ్లీలలో కూడా.. పోలింగ్ జరుగుతుంది. 10 గంటలకు మొదలు కానున్న పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఎన్డీయే నుంచి.. బీహార్ మాజీ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా యూపీయే నుంచి.. లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పోటీలో ఉన్నారు. పోలింగ్ కోసం ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా పరిశీలకులు వచ్చారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఓటు వేస్తారు. ఎంపీలు పార్లమెంట్ లో, ఎమ్మెల్యేలు ఆయా  రాష్ట్రాల్ల ఓటువేస్తారు. పార్లమెంట్ లో జరిగే పోలింగ్ లో 776 మంది ఎంపీలు ఓటేయాలి. కానీ 41 మంది లోక్ సభ సభ్యులు, 14 మంది రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల్లో ఓటేస్తున్నరు. ఆంధ్రప్రదేశ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు విజయవాడలో తన ఓటుహక్కును వినియోగించుకుంటారు. ఇక గుజరాత్ లో ఎమ్మెల్యే అయిన బీజేపీ చీఫ్ అమిత్ షా, అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ ఢిల్లీలో ఓటేస్తారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 4 వేల 896 మంది ఓటేస్తారు. ఇందులో 451 మంది మహిళలు ఉన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు.. ఓటర్లు ప్రాధాన్యతాక్రమంలో ఓట్లేస్తారు. అంటే.. ఒకరికి మొదటి ప్రాధాన్యత ఓటేస్తే, మరొకరికి రెండో ప్రాధాన్యతా ఓటేస్తరన్నట్టు. పోల్ అయిన ఓట్లను.. ఈ నెల 20న లెక్కిస్తారు.

ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికకు అంతా సిద్ధమవుతుంటే.. మరోవైపు ఉప రాష్ట్రపతి ఎన్నికలపై కూడా పార్టీలు దృష్టి పెట్టినాయి. యూపీఏ అభ్యర్థిగా… గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ రేపు వేసే చాన్స్ ఉంది. ఇక.. ఎన్డీయే నుంచి పోటీ చేసే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఇవాళ తెలుస్తుంది. ఇప్పటికే నాలుగైదు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో.. క్యాండేట్ ఎవరనేది డిక్లేర్ చేస్తారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy