అంతా రెడీ.. రాహుల్‌కు పార్టీ పగ్గాలు

RAHULడిసెంబరు 16న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్టీ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. 19ఏళ్ల పాటు పార్టీ బాధ్యతలు చూసుకున్న సోనియాగాంధీ ఆరోజు తనయుడు రాహుల్‌కు ఆ బాధ్యతలను అప్పగించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి సోమవారం(డిసెంబర్-11) అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అధ్యక్ష పదవికి నామినేషన్ల తిరస్కరణకు రేపే చివరి తేదీ. అయితే.. రాహుల్‌ ఒక్కరే అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ(సీఈఏ) ఛైర్మన్‌ ఎం.రామచంద్రన్‌, సభ్యులు మధుసూదన్‌ మిస్త్రీ, భువనేశ్వర్‌ కలితా కలిసి రాహుల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయాన్ని సోమవారం ప్రకటిస్తారు.

సోనియాగాంధీ, ఇతర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల సమక్షంలో డిసెంబరు 16న అధ్యక్షుడిగా రాహుల్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని ఆయనకు అందజేయనున్నట్లు రామచంద్రన్‌ తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి రెండు రోజుల ముందే రాహుల్‌ పార్టీ పగ్గాలు అందుకోనున్నారు. గుజరాత్‌లో ఏళ్ల తరబడి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌.. ఈ సారైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఆశపడుతోంది. మరోవైపు పార్టీ పగ్గాలు చేయపట్టబోయే రాహుల్‌గాంధీకి ఈ ఎన్నికలే తొలి సవాలు కానుంది. రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy