అంత్యక్రియలకు ఆహ్వానించి.. చనిపోయిన రైతు

farmer-suicide-v6newsఆత్మహత్య చేసుకుంటున్న రైతుల దీనగాథలు రోజూ వింటూనే ఉన్నాం. కానీ ఆ రైతు కథ అలాంటి ఇలాంటిది కాదు. చాలా మంది రైతుల్లా కాకుండా.. ఊరందరికీ చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రైతు. తాను చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలకు రావాలసిందిగా అందరినీ ఆహ్వానించాడు. ఆ తర్వాత అన్నట్టే చేశాడు. అంత సాహసానికి పూనుకున్న ఆ రైతు ఎవరు.. ఆయనకున్న కష్టాలేంటి అని ఆలోచిస్తున్నారా…

మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతానికి చెందిన ఆరైతు పేరు శేష్ రావ్ శెజుల్. ఆయనకు రెండు ఎకరాల పొలం ఉంది. అయితే కరువు పరిస్థితులతో పంటలు పండలేదు. దీంతో శేష్ రావ్ అప్పుల్లో కూరుకుపోయాడు. ఓ వైపు అప్పులు.. మరోవైపు పెళ్లివయస్సు కుమార్తె. దీంతో మనస్థాపానికి గురైన శేష్ రావ్ ఆత్మహత్య చేసుకునేందుకు సిదధమయ్యాడు. చనిపోవడానికి ఒకరోజు ముందు తన అంత్యక్రియలకు రావాలంటూ గ్రామస్థులను ఆహ్వానించాడు. అయితే శేష్ రావ్ మాటలను ఎవరూ నమ్మలేదు. మరుసటి రోజు ఉదయం నిజంగానే శేష్ రావ్ చనిపోయాడు. దీంతో విషాదంలో మునిగిపోయింది గ్రామం. ఏదో బాధలో అలా అన్నాడనుకున్నాం కానీ.. నిజంగానే చనిపోతాడని ఎవరమూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy