అందరికీ కృతజ్ఞతలు: వెంకయ్య

venkaiahభారత ఉపరాష్ట్రపతిగా తన బాధ్యతను నెరవేర్చుతానని చెప్పారు వెంకయ్యనాయుడు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. విధేయతతో నాకు మద్దతు ఇచ్చిన అందరు ఎంపీలకు నా కృతజ్ఞతలు. రాజ్యాంగానుసారం విధులు నిర్వర్తిస్తూ గౌరవప్రదంగా, సమర్థమంతంగా పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను’ అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. మరోవైపు ఉపరాష్ట్రపతిగా గెలుపొందిన వెంకయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి.

…  ‘భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనందుకు వెంకయ్యనాయుడుకు నా హృదయపూర్వక అభినందనలు. దేశం కోసం ఎంతో శ్రద్ధగా, నిబద్ధతగా పని చేస్తారని.. దేశాభివృద్ధిలో ఆయన తన లక్ష్యాలకు కట్టుబడి ఉంటారని విశ్వసిస్తున్నా.’           –  మోడీ

… ‘భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడికి నా అభినందనలు.   –  చంద్రబాబు నాయుడు

…  ‘విజయం సాధించిన వెంకయ్యనాయుడుకి నా అభినందనలు.  –  గోపాలకృష్ణ గాంధీ

… ‘హృదయపూర్వక అభినందనలు వెంకయ్యనాయుడు. రైతు కొడుకు ఉపరాష్ట్రపతిగా విజయం సాధించి.. ప్రతీ రైతు బిడ్డ దేశాభివృద్ధికి తోడ్పడతారని నిరూపించారు.                        – అమిత్‌ షా

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy