అందరికీ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. : జియో 4G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది

jio-phoneటెలికాం మార్కెట్లో మరో సంచలనానికి తెర తీసింది రిలయన్స్. జియో 4G స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసింది. మేడిన్ ఇండియా నినాదంతో ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇండియా కా స్మార్ట్ ఫోన్.. జియోఫోన్ గా అభివర్ణించారు. దేశంలోని 70కోట్ల మొబైల్ వినియోగదారుల్లో ఇప్పటికీ 50 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉన్నారన్నారు. వీళ్లందరికీ అత్యంత చౌక ధరలో స్మార్ట్ ఫోన్ అందించటంలో భాగంగా.. జియో ఫోన్ తీసుకొచ్చినట్లు ప్రకటించారు.

అన్నింటికి కంటే ఇంపార్టెంట్ ఏంటంటే.. జియో ఫోన్ ఉచితంగా ఇస్తారు. అయితే ముందుగా రూ.1,500 డిపాజిట్ చేయాలి. మూడేళ్ల తర్వాత ఈ రూ.1500 తిరిగి ఇస్తారు. భారతీయులకు మాత్రమే ఇది ప్రత్యేకంగా అభివర్ణించారు అంబానీ. ప్రస్తుతం జియో కస్టమర్లుగా ఉన్న వాళ్లందరికీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీన ఫోన్ విడుదల అవుతుంది. ఆగస్ట్ 24వ తేదీ నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఓపెన్ మార్కెట్ లోకి వస్తాయి. ప్రతి వారం 50లక్షల ఫోన్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

జియో ఫోన్ ఫీచర్స్ ఇవే :

… జియో స్మార్ట్ ఫోన్ లో బేసిక్ ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితం

… ఫోన్ 2.4 అంగుళాల స్క్రీన్ ఉంటుంది.

… SD కార్డ్, కెమెరా, టార్చ్, FM, ఇంటర్నెట్ బ్రౌజింగ్

… పవర్ ఫుల్ స్పీకర్ కూడా ఉంటుంది

… జియో యాప్స్ అన్నీ ఫోన్ తోపాటే లోడెడ్ అయ్యి ఉంటాయి.

… వాయిస్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. 22 భాషల్లో ఈ ఫోన్ సపోర్ట్ చేస్తోంది.

…  హైటెక్ సెక్యూరిటీ ఫీచర్స్ తో ఇంత తక్కువ ధరలో మరో ఫోన్ లేదని తెలిపారు.

… వాయిస్ మేసేజ్ లు పంపించుకోవచ్చు. 4-way నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది.

… ఫోన్ లోని బటన్స్ లో ఐదవ అంకె ఎమర్జెన్సీ బటన్ గా పని చేస్తోంది. ఈ బటన్ నొక్కితే మీరున్న లోకేషన్ కూడా షేర్ అవుతుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy