అందరి హృదయాలను గెలిచిన ఫోటో..రూ.57 లక్షలు విరాళం

ఢిల్లీలో ఓ ఇంట్లో మురికి గుంతను శుభ్రం చేస్తుండగా పారిశుద్ధ్య కార్మికుడు అనిల్ అందులో పడి మరణించిన సంగతి తెలిసిందే. అతడి మృతదేహం వద్ద ఓ పిల్లాడు ఏడుస్తూ ఉన్న ఫొటో  సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అది ఎంతో మంది హృదయాలు స్పందించేలా చేసింది. దానికి ప్రతి ఫలమే ఓ NGO సాయంతో వారి కుటుంబానికి రూ.57లక్షలు విరాళంగా వచ్చాయి.

ఇదంతా బాగానే ఉంది. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అందరూ ఆ ఫొటోలో పిల్లాడిని మృతుడి కుమారుడిగా భావించారు. అలాగే మరో ఇద్దరు చిన్నారులున్నారని అతని భార్యగా చెప్పుకొన్న మహిళ వెల్లడించింది. కానీ, అనిల్‌ కు అసలు పెళ్లే కాలేదట. ఈ విషయాన్ని అతడి సోదరి గీత మీడియాకు వెల్లడించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ..భార్యగా చెప్పుకుంటోన్న మహిళను అనిల్ పెళ్లి చేసుకోలేదని.. ఆమె అతడి మేనత్త అని తెలిపారు. ఆమె భర్త ముంబయిలో నివసిస్తుంటాడు. అనిల్ ఆమెతో గత మూడు సంవత్సాలుగా సహజీవనం చేస్తున్నాడు. ఆమెకున్న ముగ్గురు పిల్లలను సొంతవారిగా చూసుకుంటున్నాడు అని గీత వెల్లడించింది.

అయితే NGO ద్వారా వచ్చిన డబ్బును ఆమెతో పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అనిల్, అతడు సహజీవనం చేస్తోన్న మహిళకు కూడా ఓ కొడుకు పుట్టినా, కొద్దినెలల క్రితం నుమోనియాతో మరణించాడని ఎన్జీఓ సభ్యులు ఒకరు తెలిపారు. ఆ ఘటన చూసి మేం చాలా బాధపడ్డాం. ఆ పిల్లల బాధ్యతలను అనిల్ తీసుకున్నాడు. ఆ చిన్నారులు కనీస అవసరాలకు దూరంగా ఉన్నారు. అందుకే మేం ఫండ్‌ రైజింగ్ కార్యక్రమానికి పూనుకున్నాం అని ఫౌండేషన్ సభ్యులు యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy