అందరూ ఆహ్వానితులే : కేసీఆర్

AYUTHA WELCOME (2)రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో అయుత చండీయాగం చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. అయుత చండీయాగంపై ఏర్పాట్లు, నిర్వహణను వివరించారు. సాధారణ యాగం కాదని.. కష్టంతో కూడుకున్నది అయినా..  ఆశయం కోసం చేస్తున్నట్లు చెప్పారు. శృంగేరీపీఠం ఆధ్వర్యంలో ఈ మహాయాగం జరుగుతుందన్నారు. యాగం నిర్వహణ శృంగేరీపీఠం నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందన్నారు. ఇతరులు ఎవరికీ యాగశాలలోకి ప్రవేశం లేదన్నారు. వివిధ పీఠాధిపతులతోపాటు రాష్ట్రపతి, రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు కూడా పాల్గొంటున్నారని స్పష్టం చేశారు.

 

అయుత చండీ మహా యాగం డీటెయిల్స్

  • ఆరు రాష్ట్రాల నుంచి 1500 మంది రుత్వికులు హాజరు
  • 1100 మంది రుత్వికులు ఏకథాటిగా.. ఏకకంఠంతో పారాయణం చేస్తారు
  • యాగానికి అందరూ ఆహ్వానితులే ఎలాంటి ఆంక్షలు లేవు
  • రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది ఆహ్వానాలు
  • 10వేల మంది కూర్చుని యాగం చూడటానికి ప్రత్యేకం స్క్రీన్స్ ఏర్పాటు
  • యాగం చుట్టూ తిరగటానికి 10వేల మందికి అవకాశం
  • ప్రతిరోజు 50వేల మందికి అన్నప్రసాదం వితరణ
  • ప్రతిరోజూ 50వేల మంది అమ్మవారి పసుపు, కుంకుమ అంజేత
  • రోజూ వెయ్యి మంది మహిళలు లలితా కుంకుమార్చనలో పాల్గొంటారు
  • 20వేల వాహనాలకు పార్కింగ్ సదుపాయం

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy