అందులోనూ కత్తి అనిపించుకుంటున్న క‌త్రినా..

katrina-sarphngబాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలాంటి సాహసం చేయడానికైనా వెనకాడటంలేదు. తాజాగా అందాల భామ కత్రినా మొరాకోలో ఎంజాయ్ చేస్తోంది. ఈ అమ్మ‌డు నటించిన కొత్త చిత్రం ‘జ‌గ్గా జాసూస్’ లో క‌త్రినా న‌ట‌నికి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే జ‌గ్గా జాసూస్ సినిమా షూటింగ్ తో పాటు ప్ర‌మోష‌న్ కోసం హాలీడేస్ కి దూరంగా ఉన్న ఈ భామ సినిమా రిలీజ్ కావ‌డం ఆల‌స్యం వెంట‌నే మొరాకోలో ప్ర‌త్య‌క్షం అయింది. అక్కడ అంద‌మైన ప్ర‌దేశాలని చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అయితే క‌త్రినా తాజాగా ఓ స‌ర్ఫింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. ఎగిసిప‌డే అల‌ల‌పై స‌ర్ఫింగ్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఓ స‌హాయ‌కుడి స‌మ‌క్షంలో క‌త్రినా స‌ర్ఫింగ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ హాలీడే టూర్ త‌ర్వాత క‌త్రినా సల్మాన్ ఖాన్ తో కలిసి `ఏక్ థా టైగర్` సినిమాకు సీక్వెల్గా వస్తున్న `టైగర్ జిందా హై` సినిమా చేయ‌నుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy