అం’ధ’గాడు అదరగొట్టాడు

Andhhagaduషార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలెట్టిన రాజ్ తరుణ్ వెండి తెరపై కూడా తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే పలు చిత్రాలతో హిట్లు కొట్టిన రాజ్ అంధగాడు అనే టైటిట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ మూవీ లవర్స్ ను ఎంతో ఆకట్టుకుంది. అంధుడి పాత్ర పోషిస్తూ అందులోనూ కామెడీ చేశాడు రాజ్. ఇందులో హీరోయిన్ గా హెబా పటేల్ నటిస్తుంది. సహ నటులుగా సుదర్శన్ , సత్య మంచి పంచ్ లతో కౌంటర్ కామెడీ ఫన్ క్రియేట్ చేశారు.  ఏకే ప్రొడక్షన్ బ్యానర్ పై వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ట్రైలర్ లో టోటల్ ఫన్.. ఎమోషన్స్ ఉండటంతో ఆడియస్స్ కు ఫుల్ టైమ్ పాస్ అంటున్నారు సినీ విశ్లేషకులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy