అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌కు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

dc-Cover-hnv9mbo1rm1vou7evoq6p0a485-20170129004418.Mediహైదరాబాద్ లోని అంబర్ పేట వద్ద 4 లైన్ల బ్రిడ్జికి కేంద్రం శనివారం (సెప్టెంబర్-16) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బండి కదలటమే గగనంగా, నగరంలో వాహనదారులకు నరకం చూపుతున్న అంబర్‌పేట రోడ్డు కష్టాలకు తెర పడబోతోంది. ఈ రోడ్డుపై మూడు కూడళ్లను దాటేందుకు వీలుగా నాలుగు వరుసలతో పెద్ద ఫ్లైఓవర్  రూపుదిద్దు కోనుంది. కిలోమీటరున్నర పొడవుండే ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ అనుమతించింది. గోల్‌నాక కూడలి వద్ద ఉన్న సేలం బైబిల్‌ చర్చి దగ్గర ప్రారంభమై అంబర్‌పేట మార్కెట్‌ కూడలి దాటినతర్వాత ఉండే ముకరం హోటల్‌ వద్ద ముగిసే ఈ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.338 కోట్లు ఖర్చవుతుందని రోడ్లు భవనాల శాఖ అంచనా వేస్తోంది. ఇది జాతీయ రహదారి నం.202 కావటంతో ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy