అంబానికి షాక్: రూ.8వేల కోట్ల నష్టం

ambani-gasటెలికాం ఇండస్ట్రీని శాసిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి భారీ షాక్ తగిలింది. జియోతో సంచనాలు సృష్టిస్తూ దిగ్గజ కంపెనీలకు చుక్కుల చూపించిన వారి ఆదాయాలకు గండికొడుతున్న ఆయనకు కోట్ల రూపాయల నష్టం వచ్చింది.

రిలయన్స్ గ్యాస్ అండ్ ట్రాన్స్ పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఆర్జీటీఐఎల్) 2016 సెప్టెంబర్ వరకు రూ.8000 కోట్ల మేర నికర ఆదాయాన్ని కోల్పోయింది.RIL క్రిష్ణా గోదావరి బేసిన్ ద్వారా తక్కువ గ్యాస్ సప్లై అవుతుండటంతో కంపెనీ ఈ నష్టాలను మూటకట్టుకుంది. క్రిష్ణా గోదావరి బేసిన్ నుంచి గుజరాత్ కు కనెక్ట్ అయిన 1400 కిలోమీటర్ల వరకు గ్యాస్ పైప్ లైన్ ను కంపెనీ కలిగి ఉంది.

RIL కేజీ బేసిన్ లో ఉత్పత్తిచేసే గ్యాస్ ద్వారా కంపెనీ రెవెన్యూలను సంపాదిస్తోంది. అయితే 2016 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర ఆదాయం రూ.2641 కోట్లు నెగిటివ్ గా ఉన్నట్టు  రిలయన్స్ గ్యాస్ ఫైలింగ్ లో తెలిసింది. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ను పాటిస్తూ ఈ నికర ఆదాయాల ప్రకటనను తయారు చేశామని కంపెనీ చెప్పింది. 2010 నుంచి కంపెనీ ఒక్కసారి మాత్రమే లాభాలను ఆర్జించింది. ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా కంపెనీ రూ.4000 కోట్లను ఆర్జించాలని యోచిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy