అంబానీ అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం

ambaniరిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులో ఉన్న ఈ భవనంలోని 9వ అంతస్తులో సోమవారం రాత్రి 9:10గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ బిల్డింగ్‌లో మొత్తం 27 అంతస్తులున్నాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. పరిస్థితి అదుపులోనే ఉన్నదని తెలిపారు. 9వ అంతస్థులోని యాంటెన్నాకు నిప్పు అంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy