అంబేద్కర్ జయంతి : సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

HYD AMBEDKAR JAYANTHI TRAFFICడాక్టర్‌.B.R. అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తూ పోలీసులు  ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్‌ బండ్‌ చౌరస్తా కేంద్రంగా శనివారం రాత్రి 8 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. ఆహుతులకు ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు కేటాయించారు.

ట్రాఫిక్ మళ్లింపులు ఇవే..

-కర్బాలామైదాన్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ ను సైలింగ్‌ క్లబ్‌  నుంచి కవాడీగూడ చౌరస్తా, డీబీఆర్‌ మిల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా పంపుతారు.

– ఎన్టీఆర్‌ ఘాట్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వెహికిల్స్ ను అంబేద్కర్‌ స్టాట్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్‌ టర్న్‌ తీసుకుని ఇక్బాల్‌ మీనార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌ రూమ్, బషీర్‌బాగ్‌
మీదుగా వెళ్లాలి.

-సైఫాబాద్‌ పాత పోలీసు స్టేషన్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేద్కర్ స్టాట్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్‌ మీనార్‌ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌ రూమ్, బషీర్‌బాగ్‌ మీదుగా వెళ్లాలి.

-సాధూరామ్‌ కంటి ఆసుపత్రి నుంచి సెక్రటేరియేట్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్‌ దర్బార్‌ హోటల్, GHMC ఆఫీసు ముందుగా వెళ్లాలి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy