అక్కడే ఎందుకు : రూ.200కు బిడ్డను అమ్మిన తల్లి

child-sold-200200 రూపాయలకే బిడ్డను అమ్ముకుంది ఓ తల్లి. సంతలో సరుకు అమ్మినట్లు.. ఎంతకు వస్తే అంత అన్నట్టు కన్నపేగు బంధాన్ని తెంచుకుంది. ఈ ఘటన త్రిపురలోని గందచరలో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ బిడ్డను కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్లాడు బిడ్డ తండ్రి ఖనజోయ్ రేంగ్. తను వద్దని మొత్తుకుంటున్నా.. బిడ్డను అమ్మేసిందని పెద్దల దగ్గర మొరపెట్టుకున్నాడు. దీంతో ఆ బిడ్డను తిరిగి తల్లి వద్దకు చేర్చేందుకు రెడీ అయ్యారు పెద్దలు. బిడ్డ కొనుగోలు వ్యవహారం పెద్దది కావడంతో కొనుక్కున్న వాళ్లు కూడా బిడ్డను తల్లికి అప్పగించేందుకు సిద్ధమని తెలిపారు. అయితే బిడ్డను అమ్ముకోవడానికి గల కారణాలను స్పష్టంగా చెప్పటం లేదు తల్లి. ర

గతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 11 రోజుల బిడ్డను రూ.5వేలకు అమ్మేసుకుంది తల్లి. భర్త వైద్య ఖర్చుల కోసమే ఆ తల్లి బిడ్డను అమ్ముకున్నట్టు తెలిసింది. రెండేళ్లలో త్రిపుర గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయని తెలిపారు సోషల్ వెల్ఫేర్ అధికారులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy