అక్కడ అర్ధరాత్రే జెండా ఎగరవేస్తారు..!

maxresdefaultదేశం మొత్తం స్వాతంత్య్ర వేడుకలను ఆగస్టు 15న ఉదయం ఘనంగా నిర్వహించుకుంటే.. అక్కడ మాత్రం కాస్తా విభిన్నం. ముందురోజు అర్ధరాత్రే ఈ వేడుకలను నిర్వహిస్తారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచీ అక్కడ ఈ విధంగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించడం గమనార్హం. బిహార్‌లోని పుర్నియా ప్రాంతంలోని జెండా చౌక్‌లో రాత్రి 12.01 నిమిషానికి జాతీయ జెండా ఎగరవేసి వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో పెద్దసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ సంప్రదాయాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు రామేశ్వర్‌ ప్రసాద్‌ ప్రారంభించారు. ఆయన మరణం అనంతరం ఆయన వారసులు ఈ సంప్రదాయాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. భారత్‌కు స్వాతంత్య్రం ప్రకటించిన వెంటనే రామేశ్వర్‌ ప్రసాద్‌ పుర్నియాలో 10 వేల మందితో కలిసి అర్ధరాత్రి జెండా వందన కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వారసులు చెప్పారు. అప్పటి నుంచి ఈ వేడుకలను ఇక్కడ అర్ధరాత్రి సమయంలోనే నిర్వహిస్తున్నామని.. ఎప్పుడూ వేడుకల నిర్వహణలో విఫలం కాలేదని వారసులు చెప్పారు. ఆయన మరణానంతరం కుమార్తె సులేఖ.. ఇప్పుడు మనవడు విపుల్‌ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి వేడుకలు నిర్వహించడం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు విపుల్‌.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy