అక్కడ ఎప్పుడూ.. ఇదే రచ్చ

inside-TN-assemblyతమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీద విశ్వాస పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర గందరగోళం, సభలో సభ్యుల కేకలు, అరుపులు.. సభను సజావుగా నడవనివ్వకపోవడం లాంటివి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఇంతకుముందు ఎంజీఆర్ మరణం అనంతరం జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తినప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించారు. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడితే.. తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. సభ్యులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు కూడా. అప్పుడు స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు.

ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపిట్ అయింది. అప్పుడు జానకీ రాంచంద్రన్, జయలలిత వర్గాలు రచ్చ చేసుకుంటే..ఇప్పుడు మాత్రం డీఎంకే ఆందోళనలు చేస్తోంది. వాస్తవానికి పన్నీర్ స్వామి రచ్చ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. డీఎంకే ఎమ్మెల్యేలో ఓ లెవల్ లో రెచ్చిపోయారు. అసెంబ్లీలో సభను అడ్డుకోవడమే కాదు…ఏకంగా స్పీకర్ నే టార్గెట్ చేశారు. సభలోని బల్లలు, కుర్చీలు విరగ్గొట్టారు. మైకులు విసిరేశారు. స్పీకర్ వారించినా…డోంట్ కేర్. ప్రభుత్వానికి,  స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు ఓ అడుగు ముందుకేళారు. పార్లమెంటరీ హిస్టరీలోనే ఎప్పుడు జరగని సీన్ కు కారణమయ్యారు. సాక్షత్తూ స్పీకర్ చైర్ లో కూర్చొని…నిరసనకు దిగారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy