అక్కినేని అస్తమయం

anr

టాలీవుడ్ లో ఓ శకం ముగిసింది. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూశారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడిన ఆయన ఆరోగ్యం.. గత రాత్రి విషమించింది. ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించారు. అక్కినేని అస్తమయంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగింది. 1941 లో ధర్మపత్ని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు…. అక్కినేని. దాదాపు 256 సినిమాల్లో తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. హీరోగా ఏఎన్నార్ తొలి సినిమా సీతారామజననం. సాంఘిక, పౌరాణిక, జానపద  సినిమాల్లో ఎన్నింటిలోనో నటించారు. దేవదాసు, అనార్కలి, మూగమనసులు… లైలా మజ్ను, ఆత్మబలం, దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, మిస్సమ్మ, శ్రీకృష్ణార్జున యుద్దం, బాటసారి, సువర్ణ సుందరి, అర్థాంగి, సంతానం, దొంగరాముడు, తెనాలి రామక్రిష్ణ, సతీసావిత్రి, మాంగల్య బలం…. మహాకవి కాళిదాసు…జైజవాన్, సీతారామయ్య గారి మనుమరాలు, శ్రీరామదాసు, శ్రీరామరాజ్యం సినిమాల్లో అక్కినేని నటించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy