అక్కినేని గొప్ప వ్యక్తి: కేసీఆర్

kcr-rajaతెలుగు సినీ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకరిస్తామన్నారు సీఎం కేసీఆర్. ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు అవార్డు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి రావడం సంతోషకరమన్నారు. అక్కినేని అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన… “అక్కినేని గొప్ప వ్యక్తి. చదువింది ఐదో తరగతి. సినీ రంగాన్ని సంస్కరిస్తూ.. ఆ సినిమా స్థాయిని పెంచారు. క్రమశిక్షణతో ఉంటూ .. వారు పెరుగుతూ తెలుగు సినిమాను పెంచారు. హైదరాబాద్ కు వచ్చిన తొలి నటుడు నాగేశ్వరరావు. సినిమాలను ఇక్కడ కూడా నిర్మించాలనే సంకల్పంతో… అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం చేశారు. కొండలు, గుట్టలుగా ఉన్నా స్టూడియోను నిర్మించారు. ఆ తర్వాత ఆయన దారిలో ఎన్టీఆర్, రామానాయుడు, కృష్ణ నడిచారు. తెలుగు సినిమాకు అక్కినేని సేవలు ఎంతో గొప్పవి. ఆయన పేరుపై అవార్డు ఇస్తున్న వెంకట్ అక్కినేని, నాగార్జునలకు అభినందనలు తెలియజేస్తున్నాను. రాజమౌళి.. చలన చిత్ర రంగంలో మరిన్ని శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నాను… హృదయపూర్వకమైన ఆశీర్వచనాలు అందిస్తున్నాను.

ఆ నాటి పాటల్లో గొప్ప భావం, భాష ఉండేవి. ఈ రోజుల్లో అలాంటి పాటలను ఊహించగలమా.. ఓ సందర్భంలో శంకరాభరణం లాంటి గొప్ప సినిమా వచ్చింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ప్రతీ సినిమాలో మంచి భాష, సంస్కారం ఉన్న పాట ఒకటి పెట్టండని సినీ పెద్దలను కోరుతున్నాను. గతం నుంచి వర్తమానానికి.. వర్తమానం నుంచి భవిష్యత్ కు అందించాలని కోరుతున్నాను” అన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy