అక్టోబర్.13న ‘హలో గురు ప్రేమ కోసమే’ ప్రీ రిలీజ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘హలో గురు ప్రేమకోసమే’.. ‘‘నేను లోకల్’’ తో హిట్ కొట్టిన త్రినాథరావు నక్కిన ఈ మూవీ ని డైరెక్టర్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన  టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ హై ఎక్స్ పక్టేషన్స్ ఉన్నాయి. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్.13న గ్రాండ్ గా చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. అనుపమా పరమేశ్వరన్ ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

రామ్.. గత రెండు చిత్రాలు ఫ్లాఫ్ కావడంతో ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రామ్ తన కెరీర్ లో ఫస్ట్ టైం  ఈ సినిమా కోసం సాంగ్ పాడాడు. ప్రకాష్ రాజ్ కూడా రామ్ తో కలిసి పాడటం విశేషం. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ కానుంది.  మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy