అక్టోబర్ 26న యమలీల2 ఆడియో…

Yamaleea220 ఏళ్ల క్రితం  యమలీల మూవీ రిలీజ్ అయింది. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లోనే యమలీల2 మూవీ రిలీజ్ కానుంది. క్రిష్వీ ఫిలిమ్స్ బ్యానర్ పై అచ్చిరెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో యముడిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మూవీతో సతీష్ హీరోగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతునున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయని, శిల్పకళావేదికలో ఈ నెల 26న ఆడియో రిలీజ్ చేస్తున్నట్లు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పారు. 20 ఏళ్ల గ్యాప్ తో యమలీల2 మూవీ చేయడం హ్యాపీగా ఉందని, గత సినిమాకి..దీనికి అసలు లింకే లేదని చెప్పారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy