అక్బరుద్దీన్ అసెంబ్లీ ప్రసంగం: as it is…

ak

నిన్న అసెంబ్లీ వాయిదా వల్ల సగంలో ఆగిన MIM అసెంబ్లీ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగం ఈ రోజు కొనసాగింది. T బిల్లుకు పలు సవరణలు ప్రతిపాదించారాయన.

ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే…

 

 

ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు మా మనోభావాల్ని పరిగణనలోకి తీసుకోలేదు
తెలంగాణ నిర్ణయం రాజకీయ నిర్ణయమని వ్యతిరేకిస్తున్నారు
విభజన నిర్ణయం రాజకీయమైతే..విలీనం కూడా రాజకీయమే
ఒక భాష..రెండు రాష్ట్రాలంటున్నారు…
ముస్లింలపై ఎవరూ మాట్లాడటం లేదు
హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం కావాలి
హైదరాబాద్ ఎవరి జాగీరు కాదు
హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమే
హైదరాబాద్ రాజధానిగా రాయల తెలంగాణ కోరాం
సీమాంధ్ర ప్రజల బాగోగుల్ని కూడా పట్టించుకోవాలి
తెలంగాణలో నాలుగు లేదా రెండు సీమ జిల్లాల్ని కలపాలని కోరాం
విభజన తర్వాత ముస్లింల బాగోగుల్ని కొత్త ప్రభుత్వాలు పట్టించుకోవాలి
తెలంగాణలో హిందూత్వ పార్టీలను నిరోధించాలని కోరాం
1960నుంచి తెలంగాణలో మతఘర్షణలు జరుగుతున్నాయి
తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలకు కొందరు కుట్రలు చేస్తున్నారు
తెలంగాణకు బీజేపీ మద్దతిస్తుందా ? లేదా ?
పార్లమెంట్ సమావేశాల్లో టీబిల్లుకు బీజేపీ సపోర్ట్ ఇస్తుందా ?
కొత్త రాష్ట్రాలు రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలి
రెండు రాష్ట్రాల్లో మైనారిటీ సబ్ ప్లాన్ ఉండాల్సిందే
ఏపీ హైకోర్టు ఏర్పడినపుడు తెలంగాణకు అన్యాయం జరిగింది
హైకోర్టు జడ్జిల నియామకంలో తెలంగాణకు అన్యాయం
కామన్ హైకోర్టు అవసరం లేదు
సీమాంధ్రకు కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందే
కామన్ గవర్నర్ పోస్టు సూపర్ పవర్ అవుతుంది
కామన్ రాజధానిపై నాకు భయమేస్తుంది
ఉమ్మడి రాజధానిని వ్యతిరేకిస్తున్నాం
పంజాబ్, హర్యానా రాజధానులు ఇప్పటికీ రాజధానులు నిర్మించుకోలేకపోయాయి
ఏపీలోనూ  ఇదే జరుగుతుందేమో
కామన్ క్యాపిటల్  పదేళ్లు వద్దు
హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమే
ఖైరతాబాద్ మండలాన్ని కొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలి
కొత్త రాష్ట్రంతో ఏపీ త్వరగా అభివృద్ధి చెందుతుంది
హైదరాబాద్ పై ఢిల్లీ ఫార్ములాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
కొందరు సీమాంధ్ర నేతల డిమాండ్లు సరికాదు
లా అండ్ ఆర్డర్ సర్కార్ చేతిలో ఉండాల్సిందే
ఇతర రాష్ట్రాల మాదిరిగానే అన్ని హక్కులు ఉండాలి
లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉంటే..ఢిల్లీ పరిణామాలు ఎదురువుతాయి
గవర్నర్ ను కేంద్రమే అపాయిమెంట్ చేస్తుంది
కేంద్రంలో మతతత్వ శక్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది
త్రి సభ్య కమిటీని కూడా కేంద్రమే నియమిస్తుంది
నో కామన్ గవర్నర్..నో కామన్ రాజధాని..నో కామన్ హైకోర్టు
సైబరాబాద్, హైదరాబాద్ కమిషనర్లులు..సూపర్ సీఎంలు అవుతారు
అభివృద్ధి చెందితే స్పెషల్ స్టేటస్ కావాలా ?
యూఎస్ లో సిలికాన్ వ్యాలీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదే ?
తెలంగాణ, సీమాంధ్రలో ముస్లింలకు రక్షణ కల్పించాలి
విభజనతో ముస్లింలు భయపడవద్దు
రెండు రాష్ట్రాల్లో ముస్లింలకు తోడుగా ఉంటాం
తీవ్రవాదులకు హైదరాబాద్ షెల్టర్ గా మారింది
అమాయక ముస్లింలను టార్గెట్ చేస్తున్నారు
శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోనివి మాత్రమే
ఇతర రాష్ట్రాల కంటే ఏపీ భిన్నమైంది కాదు
కృష్ణా, గోదావరి నీళ్ల పంపకాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలి
హైదరాబాద్ కు ప్రత్యేక జలాల కేటాయించాలి
ప్రాణహిత – చేవేళ్లకు జాతీయ హోదా ఇవ్వాలి
హైదరాబాద్ కు ప్రత్యేక విద్యుత్ కేటాయింపులు చేయాలి
ఓల్డ్ సిటీకి 5వేల కోట్ల ప్రాజెక్టులు ఇవ్వాలి
తెలంగాణ ప్రజలు ఇప్పుడు కాదు..పదేళ్ల తర్వాత సంబరాలు చేసుకోవాలి
ఏపీ భవన్ ను తెలంగాణకు కేటాయించాలి
తెలంగాణకు ప్రత్యేక సర్వీస్ కమిషన్ ఉండాలి
తెలంగాణ ఇస్తే..అన్ని అధికారాలతో ఇవ్వండి..లేకుంటే వద్దు
2014ఎన్నికల తర్వాత టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ బీజేపీతో జతకట్టమని క్లారిటీ ఇవ్వాలి
తెలంగాణ ఓ ఆట కాదు
లాస్ట్ బాల్ , బ్యాటింగ్ తో ఆటగా మార్చేశారు
ప్లేయర్లు కేంద్రంలో ఉన్నారు
సర్వాధికారాల తెలంగాణ రాష్ట్రం కావాలి

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy