అక్బర్ వర్సెస్ కేటీఆర్

41443514152_625x300రైతు ఆత్మహత్యలపై శాసనసభలో చర్చ జరుగుతుండగా మంత్రి కేటీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఒకరిపై ఒకరు ఆరోపణలకు దిగారు. ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ మాట్లాడుతూ… ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ …సభలో పెద్ద గొంతు వేసుకుని మాట్లాడటం సరైంది కాదు..ఏదైనా ఉంటే సూటిగా చెప్పాలని సూచించారు. రుణమాఫీని ఒకే సారి చేసే అంశాన్నిప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. దీంతో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అక్బరుద్దీన్…. సభలో స్పీకర్ ఉండగానే సూటిగా మాట్లాడాలని చెప్పడాన్ని మంత్రి ఎవరని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలపై బాధతోనే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. కేటీఆర్ తన స్థాయికి తగ్గట్లుగా మాట్లాడితే మంచిదని సూచించారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy