అక్రమంగా తరలిస్తున్న రూ.25 లక్షల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

24Golani Gutkha 2 seized tempo loaded with gutkhaహైదరాబాద్‌ లో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 120 సంచుల సాగర్‌ గుట్కాను అల్వాల్‌ పోలీసులు పట్టుకున్నారు. బొల్లారం నుంచి కొంపల్లి వెళ్లే దారిలో ఆదివారం (సెప్టెంబర్-24)న ఈ ఘటన జరిగింది. ఆ గుట్కాను పోలీసులు సీజ్‌ చేశారు. దీని విలువ రూ.25 లక్షలు ఉంటుందని ఆల్వాల్‌ ఎస్సై రమేశ్‌ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. గుట్కా తరలిస్తున్న కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్నీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy