అక్రమ మద్యానికి సర్కార్ చెక్

alcohol_0MRP కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు

రాష్ట్రంలో అక్రమ మద్యం….గుడుంబా అమ్మకాలపై నజర్ పెట్టింది సర్కార్. ఉన్నతాధికారులు, జిల్లాల డిప్యూటీ కమిషనర్లతో రివ్యూ చేశారు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. సమావేశంలో రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, పాల్గొన్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నారనే సమాచారముందన్న వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు మంత్రి. అటు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. MRP కంటే ఎక్కువ రేట్లకు మద్యం అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం. కొన్ని జిల్లాల్లో రూల్స్ కు విరుద్దంగా అమ్మకాలు చేస్తున్న వారిపై కూడా డిస్కషన్ జరిగింది. అటు ప్రజల నుంచి వస్తున్న కంప్లైంట్ లపై అధికారులు వెంటనే రియాక్ట్ కావాలన్నారు ఎక్సైజ్ మినిస్టర్…మరోవైపు సమావేశంలో పీడీ యాక్టు కేసులపై రివ్యూతో పాటు.. వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలలో నమోదైన కేసులపై చర్చించారు. మరోవైపు గ్రామాల్లో గుడుంబా అమ్మకాలు లేకుండా చేయాలన్నారు మంత్రి. గుడుంబా తయారీ చేస్తన్న వారిపై కేసులు పెట్టి గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. అధికారుల కృషి చేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఇక పీడీ యాక్ట్ కేసులపై మీటింగ్ లో చర్చ జరిగింది.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy