అక్రమ రిజిస్ట్రేషన్లకు ఆధార్ తో అడ్డుకట్ట

aadhaar-registrationరిజిస్ట్రేషన్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 15 నుంచి ఆధార్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అమలు చేయనుంది. ఆధార్‌ నెట్‌వర్క్‌తో తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అనుసంధానమైంది. దీనిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ ఐజీ ఆహ్మద్‌ నదీం మంగళవారం (జూలై-11)న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో జరిగే రిజిస్ట్రేషన్లకు కేవలం ఆధార్‌ కార్డు జతచేస్తే సరిపోదు. ఆధార్‌ సంఖ్య ఆధారంగా వేలిముద్ర సహా ఇతర వివరాలు సరిపోలితేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుంది. లేకుంటే నిలిపివేస్తారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల వెలుగు చూసిన అక్రమాల ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. కొత్త విధానంలో ఆధార్‌ సంఖ్య ఆధారంగా ఆధార్‌ పోర్టల్‌ నుంచి వివరాలను తీసుకుని వేలిముద్రల్ని కూడా మ్యాచ్ చేస్తారు. ఆధార్‌ కార్డు అందజేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు సరిపోతేనే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఇప్పటికే పాన్‌, ఆధార్‌ సమాచారంతో అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల అనుసంధానం పూర్తయింది.
* రిజిస్ట్రేషన్‌ చేసేవారు, చేసుకునేవారు, సాక్షులు సహా అందరి ఆధార్‌ వివరాలు వేలిముద్రలతోసహా సరిపోలితేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముందుకు సాగుతుంది.
* ఆధార్‌ కార్డు లేని వారు కార్డు కోసం నమోదు చేసుకుని 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్‌ సంఖ్య, దరఖాస్తు చేసిన ధ్రువీకరణను రిజిస్ట్రేషన్‌ సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ ఆమోదిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది.
* ఆస్తులు అమ్మేవారి, కొనుగోలు చేసేవారి వివరాలను సబ్‌రిజిస్ట్రార్లు క్షుణ్ణంగా పరిశీలించి అక్రమాలకు తావులేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది.
* ఈ నిబంధనలు వ్యక్తులకే కాకుండా సంస్థలు, విద్యాసంస్థలు, హిందు అవిభాజ్య కుటుంబాలు సహాఇతర వాటికీ వర్తిస్తాయి.
* రిజిస్ట్రేషన్‌ సమయంలో రిజిస్టర్‌లలో వేలి ముద్రలు తీసుకోవడం, ఇద్దరు సాక్షులు వంటి విధానాలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ యథాతథంగా కొనసాగుతాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy