అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ ?

akilఇప్పుడు ఇదే సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్. అఖిల్ – శ్రియాభూపాల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందా.. పెళ్లి ఆగిపోయిందా.. అందరిలో ఇదే చర్చ. అంగరంగ వైభవంగా ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. అప్పుడే బ్రేకప్ ఏంటీ అని షాక్ అయ్యారు. ఇది నిజమేనా అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ఆరా తీస్తున్నారు. అఖిల్ – శ్రియాభూపాల్ విడిపోవాలని డిసైడ్ అయినట్లు జాతీయ, తెలుగు మీడియాలోనూ కథనాలు రావటం కలకలం రేపుతోంది. తనకంటే వయసులో పెద్ద అయిన శ్రియాభూపాల్ తో అఖిల్ రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. G.V.K. మనవరాలు, ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రియాతో డిసెంబర్ 9, 2016 ఎంగేజ్ మెంట్ అయ్యింది. పెళ్లి ఇటలీలో చేయటానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇంతలోనే ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయ్యిందని.. పెళ్లి ఆగిపోయింది అని వార్తలు వచ్చాయి. ఫ్లయిట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకోండి అని సన్నిహితులకు సమాచారం ఇస్తున్నారంట. రిజర్వేషన్ పెట్టుకుని ఉంటే క్యాన్సిల్ చేసుకోండి అని సన్నిహితులకు సమాచారం ఇస్తున్నట్లు జాతీయ, తెలుగు మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. చిన్నోడు అయినా.. నాగచైతన్య కంటే ముందే పెళ్లిచేసేయాలని నిర్ణయించారు నాగార్జున. అఖిల్ – శ్రియా తొందరతోనే రెండు కుటుంబాలు ఈ డెసిషన్ తీసుకున్నాయని అంటారు. ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య మాట పట్టింపులు, అఖిల్ ప్రవర్తనతో శ్రియా ఇబ్బంది పడటం వంటి కారణాలతో విడిపోవాలనుకుంటున్నారంట.  త్వరలోనే రెండు కుటుంబాలు దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీ టాక్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy