అఖిల్ లో అక్కినేని ఫ్యామిలీ

1అఖిల్ మూవీ మార్కెటింగ్ స్ట్రాటజీ అమలు చేస్తోంది. మొన్ననే ఆడియో లాంఛ్ గ్రాండ్ గా సెలబ్రేట్ కాగా.. లేటెస్ట్ గా ఈ మూవీలో అక్కినేని వంశం మొత్తం కనిపించనుందంట. అక్కినేని అక్కినేని అనే సాంగ్ లో నాగార్జున, నాగచైతన్యతోపాటు.. గ్రాఫిక్స్ లో ఏఎన్నార్ కూడా కనిపించనున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కు ఈ న్యూస్ పండగే. నాగ్, చైతన్య స్పెషల్ ఎట్రాక్షన్ ఇవ్వనున్న ఈ సాంగ్ షూటింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయ్యిందంట. ఏఎన్నార్ గ్రాఫిక్ వర్క్ పెండింగ్ లో ఉందని సమాచారం. యమదొంగ మూవీలో ఓ సాంగ్ లో ఎన్టీఆర్ గ్రాఫిక్స్ లో మెరుస్తాడు.. నాలుగు స్టెప్స్ కూడా వేస్తాడు.. ఈ విధంగానే ఈ సాంగ్ కూడా ఉండనుంది. అఖిల్ మూవీకే ఈ స్పెషల్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందని అంటోంది ఫిల్మ్ నగర్.

https://www.youtube.com/watch?v=EHQpE_5ewsA

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy