అగ్నిప్రమాదం జరిగిన చోట ఎమ్మెల్యే సెల్ఫీ

mla-selfiసెల్ఫీలపై ఎన్ని విమర్శలు వచ్చినా… జనం తీరుమాత్రం మారడం లేదు. తాజాగా రాజస్థాన్ కు చెందిన ఓ ఎమ్మెల్యే.. సెల్ఫీ తీవ్ర విమర్శల పాలైంది. అగ్నిప్రమాద స్థలంలో సెల్ఫీ దిగి దాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. బయన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారమందుకున్న ఎమ్మెల్యే బచ్చుసింగ్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక అధికారులు, ఎంఆర్‌వో పర్యవేక్షణలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బచ్చుసింగ్, ఆ తర్వాత ఘటనాస్థలి వద్ద సెల్ఫీ దిగారు. అంతేకాదు దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్త వివాదంగా మారింది. నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే దాన్ని అకౌంట్ నుంచి తొలగించాడు ఎమ్మెల్యే.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy