అచ్చం అలాగే : మన్మోహన్ బయోపిక్ ఫస్ట్ లుక్ రిలీజ్

ANUవెండితెరపై ఎన్ని కథలు, జోనర్‌ లు వచ్చినప్పటికీ బయోపిక్‌లకు ఉండే క్రేజే వేరు. కొంత కాలంగా భారతీయ సినిమా పరిశ్రమలో బయోపిక్‌ ల హవా కొనసాగుతుంది. ఇక బాలీవుడ్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేక్షలను అలరించేందుకు ఇప్పుడు మరో పిక్ రెడీ అయింది. ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్ పేరుతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ తెరకెక్కుతుంది.సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. విజయ్‌ రత్నాకర్‌ గట్టీ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో సీనియర్ నటుడు అనుపమ్‌ఖేర్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ను అభిమానులతో పంచుకున్నారు అనుపమ్‌ఖేర్‌.  ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషించడం నిజంగా సవాల్‌లాంటిందని, 24/7 మీడియా పనిచేస్తున్న కాలంలో ఆయన ప్రధానిగా ఉన్నారని, యావత్‌ ప్రపంచానికి ఆయన తెలుసని, గత కొద్ది నెలలుగా మన్మోహన్‌ పాత్రను ఆకళింపు చేసుకొంటూ…వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ప్రయత్నిస్తున్నానని అనుపమ్ ట్వీట్ చేశారు.

ఈ సినిమాలో మన్మోహన్ సలహాదారుడు సంజయ్‌ బారుగా అక్షయ్‌ఖన్నా, సోనియా గాంధీగా సజ్జన్‌ బెర్నర్ట్‌ లు నటిస్తున్నారు. డిసెంబర్‌ 21న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మూవీ టీం ఫ్లాన్ చేస్తుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy