అచ్చం సినిమాలోలాగే కొట్టుకున్నారు..!!

HYD MKPT LAND GODAWA 00021622 00005400దోభీఘాట్ ప్రభుత్వ స్థలం మీద రెండు వర్గాల మధ్య ఫైట్

కబ్జా చేస్తున్నారని అడ్డుకున్న స్థానికులను గొడ్డును బాదినట్లు బాదారు

అచ్చం సినిమాలోలాగే క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు

హైదరాబాద్ లో రియల్ మాఫియా రెచ్చిపోతోంది. పట్టపగలు రియల్ ఫైట్ తో రౌడీషీటర్స్ హల్ చల్ చేశారు. తమకు అడ్డుచెప్పిన స్థానికులపై విచక్షణా రహితంగా దాడిచేశారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలు, సోడా సీసలతో కొట్టుకున్నారు. హైదరాబాద్ మాదన్నపేటలో దోభీఘాట్ ఆక్రమణకు యత్నించిన కొందరిని స్థానికులు నిలువరించారు. భూ ఆక్రమణ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారు. దీనికి అడ్డుచెప్పిన లోకల్ పీపుల్ పై ప్రతాపం చూపారు. అక్కడున్న షాపులను ధ్వంసం చేశారు. ఇక సినిమాలోలాగా చివర్లో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. రౌడీషీటర్ల దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. ఇక ఘటనపై కేసు విచారణ మొదలుపెట్టారు పోలీసులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy