అజయ్‌ కారణంగానే పెళ్లి చేసుకోలేదు: టబు

tabuఇప్పటివరకు తాను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి అజయ్‌ దేవగణే కారణమంది సినీ నటి టబు. ప్రస్తుతం ఆమె అజయ్‌ దేవగణ్ హీరోగా నటిస్తున్న గోల్‌మాల్‌ ఎగైన్‌ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. తనకు అజయ్‌ 25 ఏళ్లుగా తెలుసని చెప్పింది. ఒకప్పుడు మా కజిన్‌ సమీర్‌ ఉంటున్న ఇంటి పక్కనే అజయ్‌ ఉండేవాడని… మేమంతా అప్పుడు మంచి ఫ్రెండ్స్‌ అని తెలిపింది. సమీర్‌తో కలిసి అజయ్‌ నన్ను ఓ కంట కనిపెడుతుండేవాడంది. ఎక్కడికి వెళ్లినా తనను ఫాలో అయ్యేవాడని… వేరే అబ్బాయిలు నన్ను చూసినా నాతో మాట్లాడినా వాళ్లని కొట్టేవాడంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నానంటే అందుకు కారణం అజయ్‌నేన స్పష్టం చేసింది. ఇప్పటికైనా అతను ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడని ఆశిస్తున్నానంది. హీరోల్లో అజయ్‌ అంటేనే ఇష్టమన్న టబు… ఇప్పటికీ చిన్నపిల్లాడిలానే ప్రవర్తించినా నన్ను చాలా బాగా చూసుకుంటాడని తెలిపింది. అతనెక్కడుంటే అక్కడఒత్తిడి మటుమాయమవుతుందని… మా ఇద్దరిదీ ప్రత్యేకమైన అనుబంధం అని చెప్పుకొచ్చింది టబు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy