అజిత్ సినిమా వరల్డ్ రికార్డ్

vivegam-777అజిత్‌ ‘వివేకం’ టీజర్‌ యూ ట్యూబ్‌లో వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇప్పటివరకు 1.90 కోట్ల మంది యూట్యూబ్ లో చూశారు. 5,24,872 వేల లైకులు కొట్టేసింది. మూడు నెలల్లో ఇన్ని లైకులతో ప్రథమ స్థానం సంపాధించిన ఈ టీజర్‌ ప్రపంచ రికార్డు సృష్టించినట్లు సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇంతకాలం యూట్యూబ్‌ ద్వారా ‘మార్వెలిన్‌ అవెంజర్స్‌’ అనే ఓ టీజర్‌ ప్రథమ స్థానంలో ఉన్నట్లు సమాచారం. అది విడుదలైన మూడు సంవత్సరాలకు ఎనిమిది కోట్ల వీక్షణలు, 5.24,009 లైకులు సాధించింది. కాని.. అజిత్‌ నటించిన వివేకం చిత్రం టీజర్‌ మూడు నెలల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టడం విశేషమంటున్నారు విశ్లేషకులు.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy