‘అజ్ఞాతవాసి’ సాంగ్ 2 పోస్టర్

PAWANపవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ కి సంబంధించి అభిమానులకు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్. ఈ సినిమాకి సంబంధించి “గాలి వాలుగ “అనే రెండో పాట డిసెంబర్‌ 12న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ సోషల్‌మీడియా ద్వారా ప్రకటిస్తూ పాట పోస్టర్‌ను విడుదల చేశారు.పోస్టర్‌లో పవన్‌ స్టైల్‌గా నిలబడి పాట పాడుతున్నట్లుగా ఉన్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. . గతంలో విడుదలైన “బైయటికొచ్చి చూస్తే” పాట ట్రెండ్ సెట్ గా నిలిచింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కన్పించనున్నారు.ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. 2018 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy