అటల్ కాదు.. భారత అణ్వాయుధం అతడు

ఇండియా భవిష్యత్తును తన కళ్లతో చూసిన దేశభక్తుడు అటల్ బిహారీ వాజ్ పేయి. అగ్రరాజ్యాల ఆంక్షలకు తలొగ్గి.. అణిగిమణిగి ఉంటున్న సమయంలో… ఇండియా తలెత్తుకుని నిలబడేలా చేశారు అటల్ జీ. తన రాజనీతితో… ప్రపంచ నిఘాకు చిక్కకుండా రాజస్థాన్ రాష్ట్రం.. జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ ఎడారి ప్రాంతంలో అణుపరీక్షలు జరిపి… భారత్ ను కూడా ఓ న్యూక్లియర్ పవర్ గా మార్చారు అటల్ జీ.

కొత్త సహస్రాబ్ది ఆరంభంలో అమెరికా, చైనా వరుసగా అణు పరీక్షలు జరిపాయి. దాయాది పాకిస్థాన్..  చైనా అండతో అణ్వాయుధాలు తయారు చేసుకుంది. 2003 ముందు నాటికి భారత్ పరిస్థితి వేరు. 1974 లో… భారత్ తొలి అణు పరీక్ష ‘స్మైలింగ్‌ బుద్ధ’  జరిపి అప్పటికే కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ మరణం.. ఆ తర్వాత వరుస అస్థిర ప్రభుత్వాల కారణంగా .. భారత్ అణ్వస్త్రాలు, అణ్వాయుధాలు తయారుచేసుకోవడంలో… వెనుకబడింది.

అమెరికా దాని మిత్రపక్షాలు… భారత్ పై ఆంక్షలు విధించాయి. అందివచ్చిన టెక్నాలజీతో… మనదేశంపై అగ్రరాజ్యం అమెరికా నిఘా పెట్టింది. ఇండియాకు న్యూక్లియర్ టెక్నాలజీ, రేడియో ధార్మిక పదార్థాలు అందకుండా చేయడం.. అణు సన్నాహకాలపై నిఘాపెట్టడమే కాదు.. థార్ ఎడారిపైనా డేగ కన్నువేసి… ఆంక్షల పేరుతో కేంద్రాన్ని బెదిరించే పరిస్థితి అప్పుడుండేది.

స్మైలింగ్‌ బుద్ధ తర్వాత.. అణుబాంబుల తయారీ రెండో దశ పరీక్షలు చేయాలని 1995లో పీవీ నరసింహా రావు ప్రయత్నించారు. అప్పటి అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ భారత్‌పై ఒత్తిడి చేసి అడ్డుకున్నారు. 1998 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో వాజ్ పేయి ప్రధాన అయ్యారు. భారత్‌ అణుశక్తి సామర్థ్యం ఉన్న దేశంగా మార్చాలన్న బీజేపీ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు వాజ్ పేయి దృఢసంకల్పంతో పనిచేశారు.  1998 మార్చి 18న వాజ్‌పేయి బహిరంగంగానే అణువిస్ఫోటం గురించి లాబీయింగ్‌ చేశారు. ఫాదర్ ఆఫ్ మిస్సైల్ ఏపీజే అబ్దుల్‌ కలాం, ఫిజిక్స్ సైంటిస్ట్ రాజగోపాల చిదంబరంలతో ప్రధాని వాజ్‌పేయి సంప్రదింపులు జరిపారు. మిసైల్ సిస్టమ్, న్యూక్లియర్ ప్రోగ్రామ్ లపై వివరాలు తెల్సుకున్నారు. సాధ్యమైనంత త్వరగా అణు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంకావాలని 1998, మార్చి 28న శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.

వాజ్ పేయి హయాంలో.. అత్యంత  రహస్యంగా  “ఆపరేషన్ శక్తి “ జరిగింది. అంతరిక్షం నుంచి శాటిలైట్లతో అమెరికా పెటిన నిఘాకు దొరక్కుండా ఇండియా మిషన్ పూర్తిచేసింది. చడీ చప్పుడు లేకుండా.. సైనిక అధికారులు.. సైనికుల దుస్తుల్లో సైంటిస్టులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి.. రహస్యంగా పరీక్ష ప్రాంతాలను సిద్ధం చేశారు. రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో బాంబు షాప్ట్‌లను మట్టి దిబ్బల్లా తయారుచేశారు. సెన్సర్లను, కేబుళ్లను మట్టితో కప్పి ఉంచారు. శక్తి-1, శక్తి-2, శక్తి-3, శక్తి-4, శక్తి-5 అణుబాంబులను రూపొందించారు. 1998, మే 13న ఉదయం 3 గంటల 34 గంటలకు వరుసగా మూడు అణుబాంబులను పరీక్షించారు. తర్వాత మిగతా రెండు బాంబులను ప్రయోగించారు. అదే రోజున.. అణుబాంబు పరీక్షలు విజయవంతం అయ్యాయని ఇండియా ప్రపంచానికి సగర్వంగా ప్రకటించింది.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రధాని వాజ్‌పేయి… ఆరోజు పోఖ్రాన్ పరిధిలో మూడు అణుబాంబులను భారత్‌ పరీక్షించిందని… అంచనా వేసిన స్థాయిలోనే శక్తి వెలువడిందని ప్రకటించారు. వాతావరణంలో ఎలాంటి రేడియేషన్‌ విడుదల కాలేదన్నారు. శక్తి మిషన్ పూర్తిచేసిన సైంటిస్టులను అభినందించారు వాజ్ పేయి.

పరీక్షల తర్వాత అగ్రరాజ్యాలు ఆంక్షలు పెంచినా.. వాజ్ పేయి రాజకీయ వ్యూహాలతో అవి తొలగిపోయాయి. అణ్వాయుధాల తయారీ..ఆయుధ సంపత్తిలో అగ్రరాజ్యాల సరసన ఇవాళ ఇండియా ఉందంటే అందుకు కారణం వాజ్ పేయి. అంతర్జాతీయ ఒత్తిళ్లను అధిగమించి.. ఇండియాను అణుశక్తిగా నిలబెట్టిన ఘనత వాజ్ పేయిదే.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy