అటు కళకళ…ఇటు విలవిల

tdp image 3ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఇలానే ఉంది. సీమాంధ్రలో టీడీపీలో వలసల ఎక్కువైయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, స్థానిక నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు… గడప తొక్కుతున్నారు. అయితే సీమాంధ్రను చంద్రబాబే అభివృద్ధి చేస్తారంటూ టీడపీ నేతలు చెప్పుకోస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో సహా మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో సీటు కన్ఫామ్ చేసుకున్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్, ఏరాసు కూడా టీడీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఎన్నికలలోపు కాంగ్రెస్ కు చెందిన మరి కొంత మంది నేతలు కూడా టీడీపీలోకి వలసలు వస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సీమాంధ్రలో టీడపీ ప్రభంజనం ఖాయం అని అక్కడి నేతలు చెప్తున్నారు.

ఇక తెలంగాణలో టీడీపీ పరిస్థితి దారుణంగా మారింది. రెండ్రోజుల క్రితం ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే రత్నంతో పాటు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి కూడా ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నరు. గతంలోనూ వరంగల్ నుంచి టీడీపీ సీనియర్ నేత కడియం శ్రీహరి, మహబూబ్ నగర్ నుంచి నాగం జనార్థన్ రెడ్డి కూడా పార్టీని వీడారు. అయితే తాజాగా టీడీపీకి చెందిన ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు కూడా సైకిల్ ను దిగి కారు ఎక్కారు. ఆదిలాబాద్ కు చెందిన బోధ్ ఎమ్మెల్యే నగేష్, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి పార్టీకి దూరం అయ్యారు. దీంతో పాటు ఎన్నికల లోపు మరికొంత మంది సైకిల్ కు గుడ్ బై చెప్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణలో టీడీపీకి అండగా ఉన్న నేతలు క్రమక్రమంగా పార్టీకి దూరం అవుతున్నారు. గతంలో టీడీపీ కంచుకోటలు బీటలు వాలాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నియమించిన కమిటీ పార్టీని తెలంగాణ ప్రాంతంలో ఎలా కాపాడుతుందోనని ఆసక్తిగా మారింది.

మొత్తానికి ఎన్నికలు సమీపిస్తు వేళ పార్టీ తెలంగాణలో వలసలు టీడీపీ క్యాడర్ లో నిరుత్సాహాన్ని నింపుతున్నాయి. అటు సీమాంధ్రలో పార్టీలోకి పోటాపోటీ వలసలను ప్రొత్సహించడం కూడా టికెట్ల విషయంలో పార్టీకి ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy