అడవుల నరికివేతపై ఉద్య‌మించిన మహిళలు.. వెన‌క్కి త‌గ్గిన‌ సీఎం

దేన్‌క‌న‌ల్ : ఒడిశాలో అడ‌వుల న‌రికివేత‌ను వ్యతిరేకిస్తూ మ‌హిళ‌లు ఉద్యమించారు. దీంతో సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ వెనక్కి తగ్గారు. సదరు భారీ ప్రాజెక్టును రద్దు చేశారు. దేన్‌క‌న‌ల్ జిల్లాలోని జింక‌ర్‌గ‌డి అడ‌వుల్లో ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం ఓ బ్రెవ‌రేజ‌స్ ఫ్యాక్ట‌రీని ఏర్పాటు చేయాల‌ని భావించింది. ఇందుకుగాను  3వ తేదీన సీఎం ప‌ట్నాయ‌క్ శంకుస్థాప‌న కూడా చేశారు. 12 ఎకరాల్లో 102 కోట్లతో పీఏ బాటిల్స్ సంస్థ ఈ కంపెనీని స్థాపించాల‌నుకున్న‌ది. దీంతో అడ‌వుల న‌రికివేత‌ను తీవ్రంగా వ్యతిరేకించిన స్థానిక మహిళలు ఉద్యమాన్ని లేవనెత్తారు. దీంతో సీఎం ప‌ట్నాయ‌క్ బ్రెవ‌రీ ప్రాజెక్టును ర‌ద్దు చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy