అడ్డంకులు సృష్టించినా.. నేరెళ్లలో సభ పెట్టి తీరతాం

mierakumarరాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో.. సోమవారం కాంగ్రెస్ పర్యటనపై.. సస్పెన్స్ కొనసాగుతోంది. సభకు కలెక్టర్ నో చెప్పడంతో.. అనుమతి కోసం కోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసింది. దీనిపై సోమవారం మధ్యాహ్నానికి కోర్టు నిర్ణయం చెప్పనుంది. అయితే.. కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా.. తాము సభ నిర్వహిస్తామని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

నేరెళ్ల సభకు.. కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. అనుమతితో తమకు సంబంధం లేదంటున్న నేతలు.. సభను జరిపి తీరతామంటున్నారు. సభకు లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అటెండ్ కానున్నారు. దీనికోసం లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న ఆమెకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి, వీహెచ్, సంపత్ కుమార్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన మీరాకుమార్ నేరెళ్ల లో దళితులపై పోలీసుల దాడిని తీవ్రంగాఖండించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేరెళ్ల లో బాధితులను కలుసుకుని తీరుతానని స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మీరాకుమార్ నేరుగా కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు బయలు దేరి వెళ్ళారు.

మరోవైపు కేసీఆర్ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, ఎమ్మెల్యే సంపత్ కుమార్. ప్రభుత్వం కావాలనే రేపటి సిరిసిల్లలో కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేశారు. రూల్స్ ప్రకారం సభలు, సమావేశాలు, ర్యాలీలు కుదరవని అంటున్నారు. ముందు జాగ్రత్తగా.. కరీంనగర్ నుంచి పోలీసు బలగాలను రప్పించారు. ఉద్రిక్తతలు ఏర్పడకుండా.. ఎస్పీ విశ్వజిత్.. ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. తర్వాత చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy