అడ్డం తిరిగిన నవదీప్ : బ్లడ్ శాంపిల్స్ ఇవ్వటానికి నిరాకరణ

navadeepనిబందనల ప్రకారం కోర్టు అనుమతిస్తే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదన్నాడు సినీహీరో నవదీప్. సినిమా ఇండస్ట్రీలో నోటీసులు అందుకున్న 12 మందిలో ఐదుగురిని ప్రశ్నించింది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్.  టాలీవుడ్ నటుడు నవదీప్ ను ప్రశ్నించారు అధికారులు.  సోమవారం ( జూలై-24) ఉదయం పదిన్నర గంటలకు మొదలైన నవదీప్ విచారణ..దాదాపు 11 గంటల పాటు సాగింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి నవదీప్ ను ప్రశ్నించారు ఆఫీసర్లు. ఈవెంట్ మేనేజర్ గా నవదీప్ చేసిన ప్రొగ్సామ్ మీద అధికారులు వివరాలు అడిగారు. డ్రగ్స్ కేసులో సిట్ ప్రశ్నలకు..జవాబులు చెప్పానన్నాడు నవదీప్. మళ్లీ విచారణకు రమ్మనలేదని.. అవసరమైతే ఫోన్ చేస్తామని అధికారులు చెప్పారన్నాడు. అధికారులకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వటానికి అడ్డం తిరిగిన నవదీప్.. కోర్టు అనుమతి ఉంటే తీసుకోవచ్చని చెప్పాడు. చార్మీ కోర్టుకెక్కిన తర్వాత ఇదే వాదనను నవదీప్ కూడా విచారణలో ప్రస్తావించటం విశేషం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy