అతడుగా మారిన ఆమె…

Womemasmen11ఓ అమ్మాయి.. అబ్బాయిగా మారడానికి మూడేళ్లు కష్టపడింది. ఎట్టకేలకు అనుకున్నది సాధించి. ఆమె పేరు జెమీ రైన్స్. ఎసెక్స్ యూనివర్సిటీలో సైకాలజీ స్టూడెంట్. ఆమె ఎనిమిది సంవత్సరాల వయసున్నప్పుడు జుట్టు చిన్నగా కత్తిరించారట. అప్పుడు అద్దంలో చూసుకొని వాళ్లమ్మతో నేను అబ్బాయిలా ఉన్నాను కదా అందట జెమీ. అప్పుడు ఆ తల్లి నవ్వుతూ.. నిజంగానే.. అని కూతురి మాటలను సమర్థించింది. అయితే ఆ తల్లి ఆ మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ జెమీ మనసులో తను మగపిల్లాడిలా మారాలని ఆలోచన పడిపోయింది మనసులో. అలా పదిహేడు సంవత్సరాల వయసు వచ్చాక తన కలను సాకారం చేసుకోవడానికి కష్టపడింది. 17 ఏళ్లు ఉన్నప్పుడు టెస్టోస్టిరాన్ హార్మోన్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. అయితే తనలో వచ్చే మార్పులను ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టింది జెమీ. అవి కాస్త 1400 అయ్యాయి. వాటిని వీడియోగా చేసి యూట్యూబ్‌లో పెట్టింది. వాటిని దాదాపు 7 లక్షల మంది చూశారు. ఈ వీడియోను ఒక న్యూస్ ఛానల్ గర్ల్స్ టు మెన్ అనే డాక్యుమెంటరీ తీయడానికి సిద్ధమైంది. అతడుగా మారిన జెమీకి ఓ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు షాబా. తను జెమీ మగాడిగా మారడానికి సహకరించిందట. త్వరలో వీరు పెళ్లి కూడా చేసుకుంటారని చెప్పాడు జెమీ.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy