అతనికే భరించలేని కష్టమా : జిల్లా కలెక్టర్ ఆత్మహత్య

suicideఅతను జిల్లా కలెక్టర్.. ఎవరికి కష్టం వచ్చినా అతనికే చెప్పుకుంటారు. ఎవరికి న్యాయం కావాలన్నా అతని దగ్గరకే వెళతారు.. జిల్లాలోని ప్రతి మనిషి కష్టం తీరుస్తూ పరిపాలన చక్కదిద్దే బాధ్యతమైన పదవిలో ఉన్నారు. అలాంటి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలో కలకలం రేపిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం బక్సర్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నారు ముఖేశ్ పాండే. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. 2012 IAS బ్యాచ్. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో రైలు పట్టాలపై శవంగా కనిపించారు. వేగంగా వెళుతున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. జేబులో ఉన్న కాగితం ఆధారంగా అతన్ని గుర్తించారు. ఆ కాగితంలో రాసి ఉన్న వివరాలు ఆధారంగా.. ఘజియాబాద్ లో బసచేసిన లీలా ప్యాలెస్ రూం నెంబర్ 742 గదిని పరిశీలించిన అధికారులు.. ఆత్మహత్య లేఖతోపాటు కలెక్టర్ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్ నోట్ ఇలా ఉంది :

ముఖేశ్ పాండే అనే నేను.. 2012 బ్యాచ్ IAS అధికారిని. బీహార్ క్యాడర్. ప్రస్తుతం బక్సర్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్నాను. ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావును మా కుటుంబ సభ్యులకు తెలియజేయండి అని రాశారు. మనిషి అనేవాడికి ఈ భూమిపై మనుగడ లేదు. బతకాలనే కోరిక చచ్చిపోయింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని రాశారు.

స్నేహితుడికి ముందే సమాచారం

ఆత్మహత్యకు ముందు తన ఫ్రెండ్స్ తో మాట్లాడాడు కలెక్టర్ ముఖేశ్ పాండే. తన నిర్ణయాన్ని చెబితే వాళ్లు చెప్పాడు. ఢిల్లీలోని జానకీపురిలోని ఓ షాపింగ్ మాల్ పైనుంచి దూకుతున్నట్లు చెప్పాడు. వాళ్లు వద్దని వారించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు స్నేహితులు. రంగంలోకి దిగిన పోలీసులు.. షాపింగ్ మాల్ సిబ్బందిని అలర్ట్ చేశారు. ఈలోపు కలెక్టర్ తన నిర్ణయాన్ని మార్చుకుని.. ఘజియాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy