అతను అన్నయ్య లాంటోడు : తమన్నా

tamanna2మిల్క్ బ్యూటీ తమన్నాతో అన్నయ్య అనిపించుకోవాలని ఎవరైనా అనుకుంటారా..? కానీ ఓ ఫిలింస్టార్ అనిపించుకున్నాడు. అతను నాకు అన్నయ్య లాంటి వాడని తమన్నా అనేసింది. దీనిపై ఈ స్టార్ ఏమనుకుంటున్నాడో కానీ.. మీడియాలో మాత్రం హాట్ న్యూస్ అయిపోయింది. ఇంతకు ఎవరబ్బా అతను అనుకుంటున్నారా..? తమన్నాను బాలీవుడ్ లో ‘హిమ్మత్ వాలా’ సినిమాతో మరోసారి లాంచ్ చేసిన డైరెక్టర్ సాజిద్ ఖాన్. ఈ డైరెక్టర్ తమన్నాను మరో సినిమాకు తీసుకోవడమే ఈ రూమర్స్ కు కారణం. తన అప్ కమింగ్ మూవీ హుంషకల్స్ సినిమాలో తమన్నాను హీరోయిన్ గా ఎంచుకున్నాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని గాసిప్స్ మొదలయ్యాయి. ఈ గాసిప్స్ కు తెరదించుతూ.. తమ మధ్య ఏమీ లేదని, సాజిద్ తనకు అన్నయ్య లాంటోడని అందరినీ షాక్ కు గురిచేసింది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy