అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ : పోచారం

pocharam1911దేశంలోనే సంక్షేమ రంగంపై అత్యధిక నిధులను ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి. ఆదివారం (నవంబర్-19) కామారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి.. పాత బాన్సువాడలోని పెద్దవాగుపై రూ. 2.5 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి, వినాయకనగర్‌లో రూ. 27.5 లక్షలతో నిర్మించిన శ్రీ శ్రీనివాస కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి…దళితుల కోసం ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్ నిర్మించడం కూడా జిల్లాలోనే మొదటిసారి అని తెలియజేశారు. రూ. 5300 కోట్లతో నలబై మూడు లక్షల మందికి పెన్షన్లను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి పోచారం. తెల్ల రేషన్ కార్డుదారులకు గతంలో 4 కిలోల బియ్యాన్ని ఇవ్వగా దానిని 6 కిలోలకు పెంచామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. షాదిముబారక్, కల్యాణలక్ష్మి పథకం ద్వారా 18 ఏండ్లు నిండిన పేద మహిళలకు రూ. 75,116 ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గర్భిణీ స్త్రీలకు రూ. 12,000 నగదు, కేసీఆర్ కిట్‌ను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy