అదరగొట్టిన అభిరామ్

ram-lookdకిషోర్ తిరుమల డైరెక్షన్ లో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటిస్తున్న ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఒక్కో స్టిల్ ని రిలీజ్ చేస్తున్నాడు హీరో రామ్. తాజాగా  త‌న ట్విట్ట‌ర్ లో స్టైలిష్ లుక్ ని పోస్ట్ చేశాడు. అభిరామ్ అనే క్యారెక్టర్ తో మీముందుకు వ‌చ్చేందుకు చాలా ఆస‌క్తిగా ఎదురు చేస్తున్నాను అంటూ ఓ స్టైలిష్ ఫోటోని పోస్ట్ చేశాడు. ఇది ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇస్తుంది. ‘నేను శైల‌జ’ వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత రామ్ త‌న 15వ చిత్రంగా చేస్తున్న ఈ మూవీ స్ర‌వంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యాన‌ర్స్ పై నిర్మిత‌మ‌వుతుంది. రామ్ సరసన అందాలభామలు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్లుగా  న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్.  ఈ చిత్రంలో రామ్ స్టైలిష్ లుక్ తో క‌నిపిస్తున్నాడంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy